5, ఏప్రిల్ 2009, ఆదివారం

సండే సరదాగా సంద్రం గురించి

అవిశ్రాంత సంద్రమా..

అవనిపై నీకంత పంతమా..

అలల తాకిడితో ముంచేస్తావు

విలయ తాండవం ఆడేస్తావు

ఒక్క క్షణంలో వచ్చేస్తావు

మరుక్షణంలో మరుగౌతావు

విలయమేనా నీ లక్షణం

ప్రళయమేనా ప్రతి క్షణం

ప్రశాంతతను ప్రసాదిస్తే..

పండు వెన్నెలతో పరిణయం చేస్తా..

సంధ్ర గానం నీవందిస్తే..

సిద్ధ మేళం నేనందిస్తా..

అలల ఘోషను నీవందిస్తే..

అమర గానం నెనందిస్తా..

ఆహ్లాదాన్ని నువు పంచిస్తే..

ఆనందాన్ని అరుణింపజేస్తా..

22, నవంబర్ 2008, శనివారం

ప్రియతమా...

అంతరంగంలో అమృతమున్నా..

ఆస్వాదించే అవకశమేదన్నా..

అన్నితెలిసిన ఆత్మబంధువే ఆగ్రహిస్తే..

అనుక్షణం అల్లంత దూరాన ఆపివేస్తే..

ప్రతి క్షణం పారిపోవడానికి ప్రయత్నిస్తే..

మరుక్షణం మాయమవుతుందేమొనని భయమెస్తే..

నా ఎద పడే యాతనని..

మనసులోని మౌన రోదనని..

గుండెని మెలిపెడుతున్నట్టుండె బాధని..ఎలా తెలుపను..

మదిలో మృధు మధుర భావనలున్నా..

మానులా బ్రతకాలనుకుంటారెందుకన్నా..

జీవితం ఓ సుధూర పయనమని..

దాని మలిమలుపు తెలియని ఓ శృజనమని..

ప్రతి క్షణం పరమాత్మ ప్రసాదమని..

అనుక్షణం ఆస్వాదించటమే తన అభిమతమని..

భయమెందుకు ఓ నేస్తమా..

నా సృజనాత్మక భావాల సంక్షిప్తమా..

మొదటి కవిత

మధుర భావాల మౌనరాగమా...
మరచిపోలేని మధుర గేయమా...
మదిని దోచిన సహవాసమా...
సుమధుర భావనల సంక్షిప్తమా...
సుస్వర సంజాతమా...
అనితర సంభావ్యమా...
ఆంతరంగిక భావమా...
నిరంతర ప్రవాహమా...
ఈ ఎదురు చూపులు నీకొసమే సుమా.......